
అనసూయ భరద్వాజ్ ఒక పక్క టీవీ షోలలో యాంకర్‌గా చేస్తూనే.. మరో పక్క వెండితెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అనసూయ సోమవారం తమ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన భర్త స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారని అనసూయ ట్వీట్ చేశారు.
‘ఈ సంవత్సరం కూడా మా ఆయన బెస్ట్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ ఏడాది మాల్దీవులకు తీసుకొచ్చారు. మై బెస్ట్.. హబ్బీ గోల్స్.. హబ్బీ లవ్.. వివాహ వార్షికోత్సవం 2018 ట్రిప్. ఆయనని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడా!’ అంటూ మల్దీవుల్లోని బీచ్ తీరంలో భర్తతో కలిసి దిగిన ఫొటోను అనసూయ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
And he does it again!!! My best!!!! Got us to #Maldives this year!!!!! How much more can love get from us!!! Hahahha😍 #touchwood #Bestsurpriseplanner #hubbygoals #hubbylove #MarriageAnniversary2018trip ❤️❤️❤️ #thankyouGodforhim 😍❤️❤️😘 pic.twitter.com/ownRuvPEFF
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 3, 2018