సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడితో కలిసి పనిచేసుందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అలాంటి ఓ గోల్డెన్ ఆఫర్‌ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాల సక్సెస్‌తో ఏకంగా సూపర్ స్టార్‌నే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
ఇప్పటికే మహేష్ బాబు, అనిల్ కాంబినేషన్‌లో సినిమా ఓకె అయ్యింది. అంతేకాదు ఈ సినిమాకు అనిల్ పది కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమా అంటే వందకోట్ల బిజినెస్ ఈజీగా జరుగుతుంది, ఆ ధైర్యంతోనే నిర్మాత అనిల్ సుంకర దర్శకుడికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment