యంగ్‌ టైగర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌! | Another Film Announced Trivikram Srinivas Junior NTR Combination | Sakshi
Sakshi News home page

యంగ్‌ టైగర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌!

Published Wed, Feb 19 2020 6:48 PM | Last Updated on Wed, Feb 19 2020 6:55 PM

Another Film Announced Trivikram Srinivas Junior NTR Combination - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మరో సినిమాకు ముహూర్తం కుదిరింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి​ కల్యాణ్‌రామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. 2020 సమ్మర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టనున్న ఈ సినిమా 2021 సమ్మర్‌ సీజన్‌లో విడుదల కానుంది.

ఇప్పటికే త్రివిక్రమ్‌-తారక్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను సాధించి పెట్టింది. ఇక తారక్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, అలియాభట్‌, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే తారక్‌ త్రివిక్రమ్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

చదవండి :
‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌
మా బుట్టబొమ్మలా.. వాటే బ్యూటీ ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement