అవి నాకు నచ్చవ్ | Anushka Shetty is waiting for the right man | Sakshi
Sakshi News home page

అవి నాకు నచ్చవ్

Published Mon, Feb 8 2016 3:11 AM | Last Updated on Wed, May 29 2019 2:59 PM

అవి నాకు నచ్చవ్ - Sakshi

అవి నాకు నచ్చవ్

పొగడ్తలకు పడనివారుండరు అంటారు. కొందరైతే డబ్బులు ఇచ్చి మరీ పొగిడించుకుంటారు.తద్వారా ఆనందాన్ని ఆస్వాదించడంతో పాటు గౌరవాన్ని తెచ్చుకుంటారు. అలాంటిది పొగడ్తలు తనకు నచ్చవు అంటోంది నటి అనుష్క. తన ఈ మాటల్లో నిజం ఎంతన్నది పాఠకులకే వదిలేస్తున్నాం. ఇంతకు ముందు అందాలారబోతల్లో ఇరగదీసిన ఈ యోగా టీచర్ ఇప్పుడు చారిత్రక కథా చిత్రాల్లో వీరనారిగా సాహసోపేతమైన నటనలోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాల్లో అనుష్క నటనను విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.

మరి కొందరు ఇంకాస్త ముందుకెళ్లి పొగడ్తలతో ముంచె త్తడంతో ఈ బ్యూటీ ఎలా స్పందించారో చూద్దాం. నాకు పొగడ్తలంటే అస్సలు నచ్చవు. ఎవరైనా పొగడడం మొదలెడితే అందులో నిజాయితీ ఎంత అని ఆలోచిస్తాను. దాని కంటే మంచి విమర్శలను స్వాగతిస్తాను. తప్పులు చెబితే వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేస్తాను. అలా కాకుండా ముఖస్తుతి చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సిగ్గనిపిస్తుంది. నన్ను సంతోషపెట్టడానికే అలా పొగుడుతున్నారని తెలుసు.

అలాంటి పొగడ్తలని,విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. కొందరు నన్ను బాలీవుడ్ నటి కరీనాకపూర్‌లా ఉన్నావంటారు.ఆమె నా అభిమాన నటే. అలాగని నేనేమీ పొంగిపోను. రాని నవ్వు ప్రదర్శించి అక్కడి నుంచి తప్పించుకుంటాను అంటున్న అనుష్క ప్రస్తుతం బాహుబలి-2 చిత్రంతో పాటు సూర్య సరసన సీ-3(సింగమ్-3) చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement