సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల జాబితాలో వినిపించే పేరు ఏఆర్ మురుగదాస్. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న ఈ డైరెక్టర్ చాలారోజులుగా ఓ తమిళ హీరోతో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడట. తనను దర్శకుడిగా పరిచయం చేసిన అజిత్ హీరోగా మరో సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు మురుగుదాస్.
ప్రస్తుతం బాలీవుడ్లో సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అఖీరా సినిమాను పూర్తి చేసిన మురుగదాస్, త్వరలో మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ బైలింగ్యువల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత మరోసారి అజిత్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రెట్టై తలా పేరుతో ఇప్పటికే కథ కూడా రెడీచేసిన ఈ సినిమాను తప్పకుండా తెరకెక్కిస్తానంటున్నాడు మురుగదాస్.
ప్రస్తుతం వీరం, వేదలం ఫేం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న అజిత్, ఆ తరువాత విష్ణువర్థన్ డైరెక్షన్లో మరో సినిమాకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
మహేష్ తరువాత అజిత్తో
Published Sat, Apr 2 2016 1:40 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement
Advertisement