పరుగుల రాణిగా నయన్‌? | AR Rahman releases teaser of Nayanthara film Aramm | Sakshi
Sakshi News home page

పరుగుల రాణిగా నయన్‌?

Published Fri, Apr 7 2017 4:38 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

పరుగుల రాణిగా నయన్‌?

పరుగుల రాణిగా నయన్‌?

సంచలన తార నయనతార పరుగులరాణిగా మారనున్నారా? కోలీవుడ్‌లో తాజా సమాచారం ఇదే. టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నయనతార ఇటీవల లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే. ఒక పక్క శివకార్తికేయన్‌ వంటి యువ హీరోలతో నటిస్తూనే మరో పక్క హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో నటిసున్నారు. మాయ తరువాత నయనతార నటించిన డోర చిత్రం పరిశ్రమ వర్గాల్లో మిశ్రమ టాక్‌ను పొందినా, వసూళ్ల పరంగా హ్యాపీనేనంటున్నారు ట్రేడ్‌ వర్గాలు.

దీంతో ఈ అమ్మడిని హీరోయిన్‌ ప్రధాన ఇతివృత్తంగా గల కథా చిత్రాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నయనతార నటిస్తున్న తాజా చిత్రం అరమ్‌ టీజర్‌ను ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్‌ బుధవారం ఆవిష్కరించడం విశేషం. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ సంచలన నటి మరో లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.నందా పెరియస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నయనతార పరుగుల రాణిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

 అందుకు తను కసరత్తులు చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళంలో అథ్లెట్‌ ఇతి వృత్తంతో చిత్రాలు వచ్చి చాలా కాలమైంది. చాలా కాలం క్రితం పరుగుల రాణి అశ్విని నాచప్ప నటించిన చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. నయనతార నటించనున్న ఆ తరహా చిత్రానికి సంబధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement