
కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్’ పేరుతో హితేశ్ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమాలో గేగా కనిపించనున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కార్తీక్ సింగ్(ఆయుష్మాన్ ఖురానా), అమన్ త్రిపాఠి(జితేంద్ర కుమార్)ల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉందని పేర్కొంది. (మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్)
ఇక.. నువ్వు గే అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు అని హీరోను తండ్రి ప్రశ్నించడం, కార్తీక్, అమన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా తరహా ట్రైన్‌సీన్లు.. అమ్మాయితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని అమన్.. కార్తీక్ కోసం పరిగెత్తుకు రావడం వంటి సీన్లతో ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్.. గతేడాది అంధాదున్, బదాయి హో వంటి సినిమాలతో హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక రెండేళ్ల క్రితం శుభ్‌మంగళ్ సావధాన్ సినిమాలో.. లైంగికపరమైన సమస్యలతో బాధపడే యువకుడిగా నటించిన ఈ హీరో.. ఈసారి అదే తరహా టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో గేగా నటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment