ట్రెండింగ్‌లో టీజర్‌.. సంతోషంలో బాలయ్య | BalaKrishna New Telugu Movie BB3 First Roar Trending On Youtube | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో టీజర్‌.. సంతోషంలో బాలయ్య

Published Thu, Jun 11 2020 2:51 PM | Last Updated on Thu, Jun 11 2020 5:07 PM

BalaKrishna New Telugu Movie BB3 First Roar Trending On Youtube - Sakshi

‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బుధవారం బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు బోయపాటి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇచ్చాడు. బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో పవర్‌ఫుల్‌ లుక్‌లో బాలయ్యకు సంబంధించిన చిన్న టీజర్‌ను విడుదలచేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. (బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూశారా!)

64 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ ఇప్పటికే దాదాపు ఏడు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ప్రస్తుతతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్ స్థానంలో కొనసాగుతోంది. బీబీ3 ఫస్ట్‌ రోర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. బాలయ్య కూడా టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘మా కాంబినేషన్‌(బాలయ్య-బోయపాటి) గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్‌ ఇది మూడో చిత్రం. అయితే ఇది మూడో చిత్రం అని ఎక్కడా టెన్షన్‌ తీసుకోవడం లేదు. హిట్‌ కాకుండా ఎక్కడికి పోతుంది ఈ సినిమా. (బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌: సాంగ్‌ విన్నారా?)

మా కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో ఆ వైబ్రేషన్స్‌ ఉంటాయి. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. టీజర్‌ అద్భుతంగా వచ్చిందని అందరూ అంటున్నారు. అందుకే ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌గా ఉంది. ఇక సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. షూటింగ్‌లు ప్రారంభమయ్యాకు గతంలో కంటే రెట్టింపు వేగంతో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తాం. ఈ టీజర్‌ తర్వాత ఈ సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. అంతకంటే రెట్టింపు అంచనాలతో సినిమాను వేగంగా మీ ముందుకు తీసుకొస్తాం’ అని బాలయ్య పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement