'తోడు లేకుండా ఉండలేనని పిలిచినట్లున్నారు' | Balakrishna Pays Tribute to Bapu | Sakshi
Sakshi News home page

'తోడు లేకుండా ఉండలేనని పిలిచినట్లున్నారు'

Published Mon, Sep 1 2014 2:46 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'తోడు లేకుండా ఉండలేనని పిలిచినట్లున్నారు' - Sakshi

'తోడు లేకుండా ఉండలేనని పిలిచినట్లున్నారు'

చెన్నై : బాపూ  లేరన్న విషయాన్ని జీర్చించుకోలేక పోతున్నానని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన సోమవారం బాపూ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. బాపూ అభిమానులు కాని తెలుగువారు ఎవ్వరూ లేరన్నారు. తెలుగుదనాన్ని, తెలుగు సంప్రదాయాన్ని బాపూ పదిలపరిచారని బాలకృష్ణ అన్నారు.

తోడు లేకుండా ఉండలేనని రమణ పిలిచినట్లు ఉన్నారని... అందుకే బాపూ వెళ్లిపోయారని బాలయ్య అన్నారు. బాపూలాంటివారికి మరణం లేదని ఆయన పేర్కొన్నారు. బాపూ సినిమా, చిత్రకళ తెలుగుదనానికి ప్రతీకగా ఆయన కొనియాడారు.  ఆయన బొమ్మలేని తెలుగు లోగిలి కనిపించదన్నారు. శ్రీరామరాజ్యం సినిమాలో నటించటం తన అదృష్టమని బాలకృష్ణ అన్నారు.  బాపూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా బాపూకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నటి దివ్యవాణి, రాజ్యలక్ష్మి, శేఖర్ కమ్మల, భానుచందర్ తదితరులు అంజలి ఘటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement