సైనిక చర్చతో అట్టుడుకుతున్న టర్కీలో బెంగాలీ సినిమాకు సంబందించిన యూనిట్ సభ్యులు చిక్కు కున్నారు. యష్ దాస్ గుప్తా, మిమి చక్రవర్తి, సౌరవ్ దాస్ లీడ్ రోల్స్ లో బిర్సా దాస్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాలీ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలోనే టర్కీలో సైనికుల తిరుగుబాటు జరగటంతో యూనిట్ సభ్యుల బంధువులు భయాందోళనలకు గురయ్యారు. అయితే టర్కీలోని ఇస్తాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న యూనిట్ సభ్యుల నుంచి సురక్షితంగా ఉన్నామంటూ సమాచారం అందటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఓ లోకల్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు ప్రస్తుతం టర్కీలో పరిస్థితులను వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడి సాధారణ పరిస్థితులు ఏర్పాడ్డాయని, సామాన్య ప్రజలు రోజువారి కార్యక్రమాలు యథావిదిగా చేసుకుంటున్నారని తెలిపాడు. దాదాపు 35 మంది బెంగాలీలతో పాటు మరో 45 మంది టర్కీకి చెందిన సాంకేతిక నిపుణుల సాయంతో సినిమా షూటింగ్ నిరాటంకంగా సాగుతున్నట్టుగా తెలిపారు. పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు ఇస్తాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న యూనిట్ సభ్యులకు మద్దతు తెలియజేశారు.
సైనిక చర్య తరువాతా.. కొనసాగుతున్న సినిమా షూటింగ్
Published Sat, Jul 16 2016 4:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement