కోల్‌కతా ఘటనపై పోస్ట్‌.. నటికి బెదిరింపులు | Mimi Chakraborty Receives Threat Warning From Unknown Over Support To Kolkata Victim | Sakshi
Sakshi News home page

Mimi Chakraborty: అండగా నిలబడితే బెదిరింపులా? హీరోయిన్ ఆవేదన

Published Wed, Aug 21 2024 9:32 AM | Last Updated on Wed, Aug 21 2024 11:04 AM

Mimi Chakraborty Receives Threat Warning From Unknown Over Support To Kolkata Victim

కోల్‌కతాలోని ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌ని అత్యాచారం చేసి దారుణంగా చంపిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే చాలాచోట్ల ఆమెకు మద్ధతు తెలుపుతూ, నిందితులని కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కోల్‌కతాలోనూ కొన్నిరోజుల క్రితం అలానే ర్యాలీ జరిగింది. ఈ క్రమంలోనే అందులో పాల్గొన్న హీరోయిన్‌ మిమీ చక్రవర్తికి ఇప్పడు బెదిరింపులు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)

డాక్టర్ హత్యకు నిరసనగా ర్యాలీలో పాల్గొన్నందుకుగానూ తనని కూడా అత్యాచారం చేసి చంపుతామని బెదిరిస్తున్నారని మిమీ చక్రవర్తి చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ని తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే.. కొందరేమో సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు చేస్తున్నారని రాసుకొచ్చింది. అలానే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ట్యాగ్ చేసింది.

2008 నుంచి సీరియల్స్ చేసిన మిమీ.. 2012 నుంచి సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టింది. 2014-2024 మధ్య మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగానూ పనిచేసింది. ఇలా ఓ సెలబ్రిటీకే వేధింపులు తప్పట్లేదు అంటే బెంగాల్‌లో సాధారణ మనుషులు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!

(ఇదీ చదవండి: ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. త్వరలో సన్యాసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement