కుమారుడిని కిడ్నాప్ చేసిన హీరో! | Bhojpuri Actor kidnaps his son for Settle With Ex Wife | Sakshi
Sakshi News home page

కుమారుడిని కిడ్నాప్ చేసిన హీరో!

Published Wed, Sep 13 2017 2:02 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

కుమారుడిని కిడ్నాప్ చేసిన హీరో!

కుమారుడిని కిడ్నాప్ చేసిన హీరో!

సాక్షి, న్యూఢిల్లీ : సినీహీరో మహ్మద్ షాహిద్ తన కుమారుడి కోసం ఆడిన నాటకం బట్టబయలైంది. దీంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. భోజ్‌పురి నటుడు మహ్మద్‌ షాహిద్‌ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ అతడికి తన రెండేళ్ల కొడుకు ఆలనాపాలనా చూసుకోవాలని ఉంది. భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఆ ఫ్యామిలీ బాబును అప్పగించేందుకు అభ్యంతరాలు చెప్పారు. విడాకులు తీసుకునే సమయంలో ఆ బాలుడి బాధ్యతలను కోర్టు తల్లికి అప్పగించింది.

భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత షాహిద్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. కానీ కుమారుడిని తనకి అప్పగించని భార్య, ఆమె కుటుంబంపై ఆయన కక్షగట్టాడు.  బాబుని కిడ్నాప్ చేసి అయినా తన వద్దకు రప్పించుకోవాలని భావించాడు. ప్లాన్ ప్రకారం.. గత జూన్ లో కుమారుడిని కిడ్నాప్ చేశాడు షాహిద్. ఈ క్రమంలో తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ జైపూర్ వాసి ముంతాజ్ దక్షిణఢిల్లీలోని జమియా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోనూ పోలీసులు తనిఖీలు చేశారు.

నటుడు మహ్మద్ షాహిద్‌పై నిఘాపెట్టిన పోలీసులు మంగళవారం పశ్చిమఢిల్లీలోని వినోద్ నగర్‌లో ఆయనతో పాటు సహజీవనం చేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రామిల్ బనియా తెలిపారు. షాపింగ్ కోసం మాజీ భార్య కుటుంబాన్ని పిలిపించి.. ప్లాన్ ప్రకారమే బాబును కిడ్నాప్ చేసి తన ప్రియురాలికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో నటుడు అంగీకరించాడు. ఆమె సాయంతో బాబును ఢిల్లీలోని పలు ఏరియాల్లో దాచిపెట్టినట్లు వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement