Mohammed Shahid
-
కుమారుడిని కిడ్నాప్ చేసిన హీరో!
సాక్షి, న్యూఢిల్లీ : సినీహీరో మహ్మద్ షాహిద్ తన కుమారుడి కోసం ఆడిన నాటకం బట్టబయలైంది. దీంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. భోజ్‌పురి నటుడు మహ్మద్ షాహిద్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ అతడికి తన రెండేళ్ల కొడుకు ఆలనాపాలనా చూసుకోవాలని ఉంది. భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఆ ఫ్యామిలీ బాబును అప్పగించేందుకు అభ్యంతరాలు చెప్పారు. విడాకులు తీసుకునే సమయంలో ఆ బాలుడి బాధ్యతలను కోర్టు తల్లికి అప్పగించింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత షాహిద్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. కానీ కుమారుడిని తనకి అప్పగించని భార్య, ఆమె కుటుంబంపై ఆయన కక్షగట్టాడు. బాబుని కిడ్నాప్ చేసి అయినా తన వద్దకు రప్పించుకోవాలని భావించాడు. ప్లాన్ ప్రకారం.. గత జూన్ లో కుమారుడిని కిడ్నాప్ చేశాడు షాహిద్. ఈ క్రమంలో తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ జైపూర్ వాసి ముంతాజ్ దక్షిణఢిల్లీలోని జమియా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోనూ పోలీసులు తనిఖీలు చేశారు. నటుడు మహ్మద్ షాహిద్‌పై నిఘాపెట్టిన పోలీసులు మంగళవారం పశ్చిమఢిల్లీలోని వినోద్ నగర్లో ఆయనతో పాటు సహజీవనం చేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రామిల్ బనియా తెలిపారు. షాపింగ్ కోసం మాజీ భార్య కుటుంబాన్ని పిలిపించి.. ప్లాన్ ప్రకారమే బాబును కిడ్నాప్ చేసి తన ప్రియురాలికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో నటుడు అంగీకరించాడు. ఆమె సాయంతో బాబును ఢిల్లీలోని పలు ఏరియాల్లో దాచిపెట్టినట్లు వివరించాడు. -
భారత హాకీ మాంత్రికుడు ఇకలేడు
-
భారత హాకీ మాంత్రికుడు ఇకలేడు
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజ ఆటగాడు మొహమ్మద్ షాహిద్(56) కన్నుమూశాడు. గత కొంతకాలం నుంచి కిడ్నీ, లివర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న షాహిద్ గుర్గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ కీలక ఆటగాడు. జూన్ 29న ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బెనారస్ హిందూ వర్సిటీలోని ఎస్ఎస్ఎల్ హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుర్గావ్ లోని మెడంటా మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నేడు షాహిద్ మృతిచెందారు. ఆయనకు భార్య ప్రవీన్ షాహిద్, ఇద్దరు సంతానం మహమ్మద్ సైఫ్, హీనా షాహిద్ ఉన్నారు. 1960 ఏప్రిల్ 14న యూపీలోని వారణాసిలో జన్మించిన షాహిద్.. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్(అండర్-19) లో ఫ్రాన్స్ పై చెలరేగి ఆడి విజయాన్ని అందించాడు. అక్కడి నుంచి అతని విజయ ప్రస్థానం రిటైరయ్యే వరకూ సాగింది. 1985-86 సీజన్లో హాకీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. సహచర ఆటగాళ్లతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడటంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించేవాడు. దూకుడుతో కూడిన వేగమే మంత్రంగా అతడు మైదానంలో చురగ్గా కదులుతూ తన ఆటతీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునేవారు. 1980 ఒలింపిక్ స్వర్ణం ఇచ్చిన ఉత్సాహంతోనే టీమిండియా 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిందని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. అంతటి స్ఫూర్తిని నింపిన దిగ్గజం మృతి హాకీకి తీరని లోటు. షాహిద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1981 లో అర్జున అవార్డు, 1986లో పద్మశ్రీతో సత్కరించింది. -
లష్కర్ ఉగ్రవాది బెయిల్ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును స్థానిక న్యాయస్థానం తోసిపుచ్చింది. భారత్‌లో విధ్వంసకర కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నిందితుడు మహ్మద్ షాహిద్ అనే ఉగ్రవాది నగరానికి చెందిన ఓ వ్యాపారిని అపహరించేందుకు యత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని హర్యానాలోని మేవట్ ప్రాంతంలో 2013,డిసెంబర్లో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు స్థానిక అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి రితేష్‌సింగ్ తోసిపుచ్చారు. ‘నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాల్సి ఉంది. నిందితుడిపై వచ్చిన అభియోగాలను దృష్టిలో పెట్టుకుని బె యిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నా’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
వ్యభిచారులు.. నిర్వాహకులపైనే కేసులా?
*విటులనూ చట్ట పరిధిలోకి తేవాలి: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: వ్యభిచార కేసుల్లో కేవలం వ్యభిచారులను, నిర్వాహకులనే మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిరోధక చట్టం 1956 కింద నేరస్తులుగా చూపుతుండటంపై ఉమ్మడి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. లైంగికేచ్ఛ కోసం వ్యభిచార గృహాలకు వెళ్లే విటులను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని అభిప్రాయపడింది. ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని శాసనకర్తలను కోరింది. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిరోధక చట్టం 1956 కింద మహ్మద్ షాహీద్ అనే విటునిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ గత వారం తీర్పు వెలువరించారు. వ్యభిచార నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4, 5 సెక్షన్ల కింద విటునిపై పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవని, అవి కేవలం వ్యభిచార నిర్వాహకులకు, వ్యభిచారులకే వర్తిస్తాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అయినప్పటికీ, లైంగికేచ్ఛ కోసం వ్యభిచార గృహాలకు వెళ్లే విటులను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఈ తీర్పు ద్వారా శాసనకర్తలను అభ్యర్థిస్తున్నట్లు జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు తన తీర్పులో పేర్కొన్నారు.