ప్రముఖ భోజ్‌పురి నటి రాణీ చటర్జీకి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె బుధవారం సోషల్ మీడియాలో తన ఆవేదనను వెల్లగక్కింది. అందులో ఆమె.. "ఫేస్‌బుక్‌లో ధనంజయ్ సింగ్ అనే వ్యక్తి నాపై వేధింపులకు పాల్పడుతున్నాడు. లావుగా ఉన్నావు, ముసలిదానా.. అంటూ నోటికొచ్చినట్లు పిలుస్తున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పడానికి కూడా వీలు లేని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొన్నేళ్లుగా దీన్ని పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు నా వల్ల కావడం లేదు. డిప్రెషన్‌కు లోనవుతున్నాను. నేనేదైనా అఘాయిత్యం చేసుకుంటే అందుకు ధనుంజయ్ సింగే కారణం" అని పేర్కొంది. (బాస్‌కే సైబర్ వేధింపులు!)
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుకు ఆమె ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. ఈ విషయం గురించి నటి ఇప్పటికే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిరాశే ఎదురైంది. ధనుంజయ్ చేసిన పోస్టుల్లో నటి పేరు ప్రస్తావించకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోలేమని పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈ వేధింపులతో మానసికంగా ఆందోళన చెందుతున్నానన్న నటి ఈ పరిస్థితి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకునేలా ఉన్నానని వాపోయింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధనుంజయ్ సింగ్ పోస్టుల స్క్రీన్‌షాట్లను సైతం ఆమె పోస్ట్ చేసింది. (బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ )
Comments
Please login to add a commentAdd a comment