
బిగ్‌బాస్ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం మరో ఎత్తు. ఇక ఈ సీన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ సత్తాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఏ టాస్క్ చేయలేడని, మాటలు తప్పా చేతలు చేయలేడని అన్న వారికి గట్టి సమాధానం ఇచ్చాడని అతని అభిమానులు కాలర్ ఎగేరుస్తున్నారు.
(రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి)
రాహుల్.. ఇంత వరకు ఏ టాస్క్‌లోనూ సరిగా ఆడలేదని ఇంటాబయట అందరూ కామెంట్లు చేసేవారు. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రాహుల్‌పై పునర్నవి కామెంట్లు చేసింది. వితికాను ఎత్తుకుని పరిగెత్తే విషయమై.. వారంతా చర్చించుకుంటూ ఉంటే.. చేయి నొప్పి, కాలు నొప్పి అంటావ్ టాస్క్ నీకవసరమా? అంటూ రాహుల్‌నుద్దేశించి పునర్నవి పేర్కొంది. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. వీకెండ్ ఎపిసోడ్‌లో ఇది ఇంకాస్త పెరిగింది. ఇక ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ అంటూ పున్ను చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక పునర్నవిని ఎలా రీచార్జ్ చేయాలో తెలియని రాహుల్‌ను.. బిగ్‌బాస్ దగ్గరుండి మరి చేయించాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వారిద్దరు అలా దూరంగా ఉంటే పుటేజ్ దొరకడం లేదని.. ఇద్దర్నీ కలిపేందుకు అలాంటి టాస్క్ ఇచ్చాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తన కోసం ఇరమై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను తాగగలడా? అని అనుమానం వ్యక్తం చేసిన పునర్నవికి.. విజయవంతంగా తాగి చూపించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మొదట కాస్త కష్టంగానే అనిపించినా.. ఆ టాస్క్‌ను రాహుల్ మొత్తానికి పూర్తి చేసేశాడు. దీంతో పునర్నవికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంతుపట్టని సంతోషంతో.. రాహుల్‌ను హగ్ చేసుకుని, ముద్దు పెట్టింది. ఇక ఇదే నెటిజన్ల దొరికిన పాయింట్. పునర్నవి ముద్దు పెట్టిన సీన్‌పై సోషల్‌మీడియాలో వందలకొద్ది మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తానికి నిన్నటి ఆ టాస్క్, ఆ సీన్‌తో రాహుల్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. అయితే దీనిపై పున్ను ఫ్యాన్స్ కాస్త అసహనానికి లోనైట్టు కనిపిస్తోంది. వారి అసంతృప్తిని మీమ్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. వీరిద్దరిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్‌ను మీరూ చూసేయండి.











Comments
Please login to add a commentAdd a comment