
బిగ్‌బాస్ హౌస్.. కొన్ని సరదాలు, మరికొన్ని భావోద్వేగాలు, ఇంకొన్ని గొడవలతో నిండిపోయింది. నేటి ఎపిసోడ్‌లో ఎప్సన్ టాస్క్‌తో కొంత ఫన్ క్రియేట్ చేయగా.. కుటుంబ సభ్యులు పంపిన సందేశాలతో ఇంకొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక బాబా భాస్కర్.. మహేష్ ప్రవర్తన గురించి ఆందోళన చెందడం.. చివర్లో పునర్నవి, రాహుల్, వితికా, వరుణ్ మాట్లాడుకోవడం హైలెట్‌గా నిలిచింది.
నిన్నటి టాస్క్‌లో గెలుపొంది కెప్టెన్‌గా ఎన్నికైనా బాబా భాస్కర్ విషయంలో.. శిల్పాకు శ్రీముఖి మాత్రమే కంగ్రాట్స్ చెప్పడంతో ఆయన ఫీలయ్యాడు. దీంతో బాబా భాస్కర్‌ను క్షమించమని శ్రీముఖి ప్రాధేయపడింది. ఇక కొత్తగా ఎన్నికైన కెప్టెన్ ఇంటి సభ్యులందరికీ పనులను కేటాయించాడు. కొత్త రూల్స్‌ను పెట్టాడు. శ్రీముఖి చేత గార్డెన్ ఏరియాలో ఉన్న సోఫాలను క్లీన్ చేయించాడు. తనను టార్గెట్ చేశాడంటూ.. శిల్పా, శివజ్యోతిలతో శ్రీముఖి చెప్పుకుంటూ సరదాగా కామెంట్లు చేసింది. ఆడదాని వల్ల కెప్టెన్‌గా ఎన్నికయ్యాడని.. మాష్టర్ పక్షపాతం చూపిస్తున్నాడని.. వారితో చెప్పుకొచ్చింది.
ఎప్సన్ టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యులను ఐదు జంటలుగా విడగొట్టాడు. ఈ టాస్క్‌కు శ్రీముఖిని సంచాలకుడిగా నియమించాడు. ర్యాపిడ్ ఫైర్‌లా జవాబులు చెప్పాలని.. అందులో ఎవరు ఫన్నీగా ఆన్సర్స్ చెబుతారో వారో విన్నర్ అవుతారని.. అలా గెలిచిన వారికి ఎప్సన్ టీ షర్ట్ లభిస్తుందని తెలిపాడు. ఆ టాస్క్‌లో మహేష్ ఫన్నీ ఆన్సర్స్ చెప్పాడని అందరూ ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించాడు. దీంతో మహేష్‌కు ఎప్సన్ హ్యాపీ ఫేస్ ఆఫ్ ది డే టీషర్ట్ లభించింది.
తమ కుటుంబ సభ్యుల నుంచి బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరికీ ఉత్తరాలు.. వారికి ఇష్టమైన వంటకాలు వచ్చాయి. ప్రతీ హౌస్‌మేట్ తమకు వచ్చిన సందేశాలను చదివి వినిపించారు. అంతే కాకుండా తమకు ఇష్టమైన వంటకాలను పంపడంతో అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం బాబా భాస్కర్.. మహేష్ విషయంలో కాస్త కలత చెందినట్లు కనిపిస్తోంది. అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చెబుతున్నాడని శ్రీముఖి, హిమజ, అలీతో చెప్పుకుంటూ తెగ ఫీలైపోయాడు.
పునర్నవి మీద ఎలాంటి ఫీలింగ్ లేదా అంటూ రాహుల్‌ను వితికా ప్రశ్నించింది. కొంచెం కూడా ప్రేమ లేదా? అంటూ వితికా ప్రశ్నించగా.. తనకు ఇష్టమైతే నేరుగా వెళ్లి పునర్నవిని అడుగుతానని, ప్రపోజ్ చేస్తానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయమై.. పునర్నవిని వరుణ్ ప్రశ్నించగా.. రాహుల్ అంటే ఇష్టమే కానీ ప్రేమ లేదని చెబుతూ ఉండగా.. మధ్యలో కలగజేసుకుని ‘ఐ లవ్యూ నవి’ అంటూ రాహుల్ ప్రపోజ్ చేశాడు. సరదాగా అన్నానంటూ రాహుల్ మళ్లీ కవర్ చేసేశాడు. మరి చివరకు వీరి కథ ఎక్కడి వెళ్లి ఆగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment