షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో | Bigg Boss 3 Telugu: Rahul Sipligunj Shocking Video | Sakshi
Sakshi News home page

రాహుల్‌ బండబూతుల వీడియో, టోటల్‌ డ్యామేజ్‌

Published Sun, Oct 27 2019 11:52 AM | Last Updated on Mon, Oct 28 2019 2:20 PM

Bigg Boss 3 Telugu: Rahul Sipligunj Shocking Video - Sakshi

రాహుల్‌ సిప్లిగంజ్‌.. నోటి దురుసుతో ఫేమస్‌ అయిన వ్యక్తి. అతని నోటికి అడ్డూఅదుపు ఉండదు. ఇంట్లో రాహుల్‌తో గొడవపడని వ్యక్తి లేడంటే అర్థం చేసుకోవచ్చు. అతని కోపం వల్ల స్నేహితులతోనే వైరాలు ఏర్పడ్డ సంఘటనలు కోకొల్లలు. ఇక హౌస్‌లో ముందు నుంచీ టాస్క్‌ల్లో పెద్దగా కష్టపడకపోయినా. ఫైనల్‌ దగ్గరపడుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆటలో తానేంటో నిరూపించుకుంటున్నాడు. టికెట్‌ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా తన పేరును లిఖించుకున్నాడు. బయట సింగర్‌గా ఉన్న పేరు కన్నా.. బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరూ రాహుల్‌ను కార్నర్‌ చేయడంతో అతని క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.

బిగ్‌బాస్‌ చివరి వారంలో ప్రేక్షకులు వేసే ప్రతీ ఓటు వారి గెలుపుకు దారులు నిర్మిస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే షాకింగ్‌ వీడియో బయటకొచ్చింది. ఇందులో రాహుల్‌.. బిగ్‌బాస్‌ 1 సీజన్‌ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ పాడిన మంగమ్మ పాటను బిగ్‌బాస్‌ హౌస్‌లో నిర్వాహకులు ప్లే చేశారు. అయితే, ఇదేం పాట అంటూ కొంతమంది ఇంటి సభ్యులు చులకనగా మాట్లాడారు. దీనిపై రాహుల్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు. హౌస్‌మేట్స్‌ను బండబూతులు తిట్టాడు. తన పాటను కించపరిచిన వాళ్లను ఉద్దేశిస్తూ.. ఒకసారి వెళ్లి అద్దంలో మొహం చూసుకోండి అని వ్యంగ్యంగా విమర్శించాడు.

‘నా సాంగ్‌ను చిల్లర పాట అంటున్నారు.. వారి జీవితంలో అలాంటి అచీవ్‌మెంట్‌ ఉందా’ అని వెటకారంగా మాట్లాడాడు. ప్రతీ వాక్యంలో బూతులను జోడిస్తూ అసభ్యంగా మాట్లాడాడు. బండబూతులతో నిండిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇటువంటి వ్యక్తికి బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచే అర్హతా ఉందా అంటూ నెటిజన్లు రాహుల్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఫైనల్‌కు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఈ వీడియో రాహుల్‌ ఓట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. మరి దీన్ని రాహుల్‌ అభిమానులు ఏ విధంగా ఖండిస్తారో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement