
బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్‌లు ఇస్తూ నవ్విస్తాడు.. అంతలోనే మరో టాస్క్ ఇచ్చి గొడవలు పెడతాడు. మళ్లీ అప్పుడే వాళ్లతో ఆటలు ఆడిస్తాడు. ఈ క్రమంలో నేడు బిగ్‌బాస్ ఇవ్వనున్న టాస్క్ వీటన్నింటికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యుల జీవితాలను కుదిపేసిన ఘటనలను వారితోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్టయితే.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, అల్లరిగా ఉండే శ్రీముఖి చిరునవ్వు వెనక తీరని విషాదం ఉందని అర్థమవుతోంది. అయితే యాంకర్ శ్రీముఖి ఇప్పటివరకు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోడానికి ఇష్టపడలేదు. (చదవండి: శ్రీముఖికి నేనున్నానంటూ అభయమిస్తున్న రష్మీ)
కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యుల సమక్షంలో తన జీవితంలో జరిగిన చేదు ఘటనను వెల్లడించినట్లు తాజా ప్రోమోలో తెలుస్తోంది. శ్రీముఖి కూడా ప్రేమలో పడిందని.. కానీ అది ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం బ్రేకప్ అయిందని స్పష్టమవుతోంది. అది కూడా ఘోరంగా బ్రేకప్ జరిగిందని, ఆ సమయంలో చచ్చిపోవాలనిపించిందని తను పడిన బాధను చెప్పుకొచ్చింది. తన రిలేషన్‌షిప్ వల్ల ఎంత వేదనను అనుభవించిందో ఇంటి సభ్యులతో పంచుకుని మనసు తేలిక పరుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి పేరు వెల్లడించిందా? గోప్యంగా ఉంచిందా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
#Sreemukhi opens up on her relationship #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/3j4wK2Klel
— STAR MAA (@StarMaa) October 24, 2019