థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ | Bigg Boss 3 Telugu: Trolls On Sreemukhi Ads In Theatres | Sakshi
Sakshi News home page

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

Oct 16 2019 5:04 PM | Updated on Oct 20 2019 11:23 AM

Bigg Boss 3 Telugu: Trolls On Sreemukhi Ads In Theatres - Sakshi

బిగ్‌బాస్‌ షోలో అందంతో అదరగొడుతూ.. అల్లరితో అలరిస్తున్న ఏకైక వ్యక్తి శ్రీముఖి. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి టాప్‌ 3లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈవారం నామినేషన్‌లో ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. దీంతో ఎవరి అభిమానులు వారికి గట్టిగానే క్యాంపెయినింగ్‌ నిర్వహిస్తున్నారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్‌ జరుగుతోంది. ఓట్‌ ఫర్‌ శ్రీముఖి అంటూ  సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్‌ ప్రత్యక్షమవుతున్నాయి.

దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం కల్పించడానికి కొంతమందిని నియమించుకుందని అంటున్నారు. ఆ పెయిడ్‌ బ్యాచ్‌.. రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్టర్లు, యాడ్స్‌ అంటూ ఏ ఒక్కటినీ వదలకుండా ఆమెను సేవ్‌ చేయండంటూ దరువు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. పెయిడ్‌ బ్యాచ్‌ సహాయంతో నకిలీ ఓట్లు సంపాదించి టైటిల్‌ విన్నర్‌గా నిలవాలని చూస్తోందని ఆరోపించారు. ఆమెకోసం ఎంత ఖర్చు పెట్టినా వృథాయే అని ప్రచారాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు కొంతమంది యాంటీఫ్యాన్స్‌. ఇలాంటి యాడ్స్‌ వల్ల ఉన్న ఓట్లు కూడా పోతాయని ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా ఎవరేం చేసినా టైటిల్‌ సాధించే అర్హత ఒక్క శ్రీముఖికే ఉందంటూ ఆమె అభిమానులు వెనకేసుకొస్తున్నారు. ఒకరి ప్రచారశైలిని తప్పుపట్టే అర్హత ఎవరికీ లేదంటూ శ్రీముఖి అభిమానులు వాటికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తతంగం అంతా చూస్తుంటే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 లో కౌశల్‌ ఆర్మీ చేసిన హంగామా గుర్తుకు వస్తోంది. అతను కూడా పెయిడ్‌ ఆర్టిస్టులతో ఓట్లు సంపాదించి టైటిల్‌ గెలిచాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసందే! అయితే అదే ఫార్ములా ఇక్కడ గుడ్డిగా ఫాలో అవుతే మొదటికే మోసం వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.ఏదేమైనా అటు ప్రచారంతో ఇటు ట్రోలింగ్‌తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది రాములమ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement