బిగ్‌బాస్‌: శ్రీముఖి కోసం డ్యాన్స్‌ పోటీలు! | Bigg Boss 3Telugu: Ramulamma Contest Compaign For Srimukhi | Sakshi
Sakshi News home page

రాములమ్మ స్టెప్పులతో శ్రీముఖితో డాన్స్‌ చేసే అవకాశం

Oct 28 2019 4:53 PM | Updated on Oct 30 2019 12:28 PM

Bigg Boss 3Telugu: Ramulamma Contest Compaign For Srimukhi - Sakshi

 శ్రీముఖి అభిమానులు  విభిన్న ప్రచారంతో ముందుకొచ్చారు. రాములమ్మ (శ్రీముఖి)ను గెలిపించడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజయవంతంగా పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 14వ వారంలో శివజ్యోతి ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక హౌజ్‌లో ఉన్న రాహుల్‌ సిప్లిగంజ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, వరుణ్‌, అలీ రెజా ఫైనల్‌ రేసులో తలపడతారు.  బిగ్‌బాస్‌ టైటిల్‌ సాధించడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇటు అభిమానులు కూడా కంటెస్టెం‍ట్ల పేరుతో ఆర్మీలు పెట్టి దుమ్ము లేపుతున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓట్లు వేయండని ప్రచారాన్ని ఉదృతం చేశారు. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ పోట్లాటలు కూడా  ఎక్కువవయ్యాయి. ఏం చేసినా ఒక్కవారమే అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న శ్రీముఖి అభిమానులు  విభిన్న ప్రచారంతో ముందుకొచ్చారు. రాములమ్మ (శ్రీముఖి)ను గెలిపించడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు.

ఇందుకోసం ‘రాములమ్మ కాంటెస్ట్‌’ నిర్వహిస్తున్నారు. దీంట్లో అమ్మాయిలు, అ‍బ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ప్రచారం చేయొచ్చు అని చెప్తున్నారు. ‘రాములమ్మ కాంటెస్ట్‌’ పాల్గొనడం కష్టతరమైనదేమీ కాదు. ఒసేయ్‌ రాములమ్మ పాటకు శ్రీముఖి చేసే సిగ్నేచర్‌ స్టెప్పును వేస్తూ వీడియో తీయాల్సి ఉంటుంది. ఆ వీడియోను #THISTIMEWOMAN, #VOTEFORSREEMUKHI హ్యాష్‌ట్యాగ్‌లను జోడించి ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేయాల్సి ఉంటుంది. పోటీ నిర్వాహకులు వాటిలో అత్యుత్తమ డాన్స్‌ వీడియోను ఎంపిక చేసి, వారికి శ్రీముఖితో కలిసి డాన్స్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ పోటీ మరింత సులువుగా అర్థమవటం కోసం శ్రీముఖి.. పిల్లలతో కలిసి చేసిన డాన్స్‌ వీడియోను కూడా అందుబాటులో ఉంచారు. ఈ కొత్త ట్రిక్‌ ఏమేరకు పనిచూస్తుందో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement