ఆ వారం రోజులు ఒళ్లంతా నొప్పులే: దీపిక
ఆ వారం రోజులు ఒళ్లంతా నొప్పులే: దీపిక
Published Fri, Jan 13 2017 5:14 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
హాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ది జండర్ కేజ్‌లో నటించిన భారతీయ నటి దీపికా పదుకొనే తన మూవీ ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు జవాబులిచ్చింది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు తనకు సవాలుగా నిలిచాయన్న దీపిక, ప్రతి సీక్వెన్స్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఒళ్లు నొప్పులు వేధించేవని తెలిపింది. అయితే, అదృష్టవశాత్తు షూటింగ్ మొత్తంలో తనకు మాత్రం ఒక్క గాయం కూడా కాలేదని అభిమానులకు చెప్పింది. విన్ డీజిల్, రూబీ రోజ్, నైనా డెబ్రేవ్, టోనీ కొల్‌టే, శ్యాముల్ జాక్సన్ లాంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం జనవరి 14న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ప్రస్తుతం హీరో విన్ డీజిల్, దర్శకుడు డీజే కరుసో సినిమా ప్రమోషన్‌లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో గురువారం నిర్వహించిన ప్రీమియర్‌కు అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భగా హీరో విన్ డీజిల్‌ను దీపిక పొగడ్తలతో ముంచెత్తింది. విన్ అందగాడు, మంచి మనస్సున్న వాడంటూ ఆకాశానికెత్తేసింది. కరుసో అయితే భారతదేశంలోనే ఉండిపోవాలనుకుంటున్నాడని, ఇక్కడ మరింత కాలం ఉండి ఈ అనుభూతులు ఆస్వాదించాలన్నది అతడి కల అని చెప్పింది. నీర్జా, పింక్, ఏ దిల్ హై ముష్కిల్, కపూర్ అండ్ సన్స్ తనకు ఈ ఏడాదిలో నచ్చిన సినిమాలని మరో అభిమానికి ట్విట్టర్ ద్వారా దీపిక సమాధానమిచ్చింది.
Advertisement
Advertisement