బాయ్‌ఫ్రెండ్ పాటలు | 'Boyfriend' movie adio released | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్ పాటలు

Published Sun, Mar 16 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

బాయ్‌ఫ్రెండ్ పాటలు

బాయ్‌ఫ్రెండ్ పాటలు

మెగాసుప్రీమ్, భవానీ అగర్వాల్ జంటగా వేదభూమి సమర్పణలో నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్’. లక్కరాజు రాధా రాజేశ్వరి, అభి నిర్మాతలు. యల్.యమ్. ప్రేమ్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక తిరుపతిలో జరిగింది. రుద్రరాజు శ్రీదేవి, సైకం రామచంద్రారెడ్డి, రేణుకా శివనాగు అతిథులుగా పాల్గొన్నారు. శివనాగు మాట్లాడుతూ -‘‘బాయ్‌ఫ్రెండ్ ఏం చేస్తాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో పాటలన్నీ యువతను ఆకట్టుకునే విధంగా ఉంటాయి కాబట్టే, కాలేజీలో ఆడియో వేడుక చేశాం. పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. థియేటర్ ప్రోమోస్ ఆవిష్కరణను జిల్లాలవారీగా ప్రతి కాలేజీలో జరుపుతున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement