
తేజ దర్శకత్వంలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!
తేజ దర్శకత్వంలో ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందనుంది. దర్శక, నిర్మాత, రాజకీయవేత్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దీనికి నిర్మాత. సోమవారం కేతిరెడ్డి పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ - ‘‘తెలుగు భాష విశిష్టతను చాటిన తెలుగు తేజం శ్రీ కృష్ణదేవరాయుల్ని అవహేళన చేసే రీతిలో తమిళ నటుడు వడివేలు ప్రధాన పాత్రలో ఇటీవల ఓ చిత్రం రూపొందింది. ఆ తమిళ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ జగదీశ్వరరెడ్డి తమిళనాడులో ధర్నాలు నిర్వహించి, తెలుగువారి గొప్పతనాన్ని చాటారు. నేటి తరానికీ, రాబోయే తరానికీ తెలుగు భాష గొప్పతనం చెప్పే ఈ డాక్యుమెంటరీ చేయనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.