సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జుండ్’ చిత్ర విడుదలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీ, థియేటర్లలో ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్నికుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జుండ్ రచయిత, దర్శకనిర్మాతలు, అమితాబ్ బచ్చన్, టీసిరీస్, తాండవ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన ప్రతివాదులు కౌంటర్ రిప్లైని దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 28కి వాయిదా వేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
స్లమ్ సాకర్ చాంపియన్ అఖిలేష్ పాల్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు కాపీ హక్కులను కొనుగోలు చేశానని నంది చిన్ని కుమార్ పేర్కొంటున్నారు. అయితే అఖిలేష్ కోచ్ విజయ్ బర్సె నుంచి అఖిలేష్ జీవిత కథకు సంబంధించి హక్కులను జుండ్ చిత్ర బృందం అక్రమంగా కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై అఖిలేష్‌ను ప్రశ్నించగా ఆయన తన కోచ్‌కు, జుండ్ చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. అంతేకాకుండా తన పాత్రకు సంబంధించి ఎలాంటి పోలికలు ఉండకూడదని చిత్రబృందానికి అఖిలేష్ హెచ్చరించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తాను కూడా చిత్ర బృందానికి ఓ లీగల్ నోటీసు పంపినా ఎలాంటి సమాధానం రాలేదని చిన్ని కుమార్ వివరించారు.
అయితే కొన్ని రోజుల తర్వాత రచయిత నాగరాజ్ మంజులేకు తన జీవిత కథకు సంబంధించి హక్కులను అమ్మినట్లు లీగల్ నోటీసును తనకు పంపించారని తెలిపారు. అయితే అఖిలేష్ నుంచి ఎలాంటి హక్కులను కొనుగోలు చేయలేదని జుండ్ నిర్మాతలు కొట్టిపడేస్తున్నారన్నారు. ఈ విషయంలో నాకు న్యాయం కల్పించాలిన కోర్టుకు ఆశ్రయించినట్లు చిన్ని కుమార్ తెలిపారు. అంతేకాకుండా అఖిలేష్, దర్శకనిర్మాతలతో తాను మాట్లాడిన ఆడియో టేపులు నా దగ్గర ఉన్నాయని చిన్ని కుమార్ తెలిపారు. ఇక గతంలో కూడా ‘బిగిల్’(తెలుగులో విజిల్) ప్రధాన పాత్రధారి కాపీరైట్ ఉల్లఘించినట్టు పేర్కొంటూ, బిగిల్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాకుండా చిన్ని కుమార్ అడ్డుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment