కాజల్ హీరోయిన్...తరుణ్ విలన్! | chiranjeevi 150th movie heroine kajal and tarun arora villain confirmed | Sakshi
Sakshi News home page

కాజల్ హీరోయిన్...తరుణ్ విలన్!

Published Sun, Jul 31 2016 12:30 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కాజల్ హీరోయిన్...తరుణ్ విలన్! - Sakshi

కాజల్ హీరోయిన్...తరుణ్ విలన్!

చిరంజీవి తాజా చిత్రంలో కథానాయిక ఎవరు? అనే చర్చకు శనివారం ఫుల్‌స్టాప్ పడింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ని కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్రనిర్మాత రామ్‌చరణ్ ప్రకటించారు. మెగా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సరసన కాజల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవితో జతకట్టే అవకాశం దక్కించుకున్నందుకు ఆనందపడతారని ఊహించవచ్చు. తమిళ ‘కత్తి’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.

అక్కడ విలన్‌గా హిందీ నటుడు నీల్ నీతిన్ మఖేష్ చేశారు. తెలుగు రీమేక్‌కి విలన్‌గా తరుణ్ అరోరాను ఎంపిక చేశారు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన తరుణ్ తమిళంలో ‘కనిదన్’ చిత్రంలో యాక్ట్ చేశారు. ఆ చిత్రంలో నటన నచ్చి, చిత్రదర్శకుడు వినాయక్  విలన్‌గా తీసుకున్నారట. అన్నట్లు ఈ తరుణ్ అరోరా ఎవరో కాదు.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న అంజలా జవేరి భర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement