
తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’ చిత్రాన్ని తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తిగా తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ జూన్ 18 సాయంత్రం 5 గంటలకు చిరంజీవి కౌసల్యా కృష్ణమూర్తి టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment