
క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే తండ్రి, ఆయన ఆశయాన్ని నెరవేర్చే కూతురి కథాంశంతో.. తమిళంలో వచ్చి సూపర్‌హిట్‌గా నిలిచిన కణ చిత్రాన్ని తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేస్తున్నారు. అక్కడ సత్యరాజ్‌చేసిన పాత్రను ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. కేవలం మోషన్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రం.. తాజాగా చిరు చేతుల మీదుగా టీజర్‌ను రిలీజ్‌చేయింది మరింత హైప్‌ను క్రియేట్ చేయనుంది.
అయితే నేటి సాయంత్రం ఐదు గంటలకు చిరు ఈ మూవీ టీజర్‌ను చిరు విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే టీజర్‌ను వీక్షించిన చిరు.. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు ఫోన్ చేశారట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఫోన్ రావడం ఆశ్చర్యం కలిగించింది. టీజర్ నచ్చిందని చిరు అన్నారు. ఆయన నాతో మాట్లాడిన విధానానికి.. నేను ఇంకా ఆశ్యర్యంలోనే ఉన్నాను. థ్యాంక్యూ సో మచ్ సర్’ అంటూ ట్వీట్ చేశారు. చూస్తుంటే చిరు ఫోన్‌తో ఐశ్వర్య గంతులేసినట్లు అనిపిస్తోంది. చిరుకు నచ్చిన ఈ టీజర్‌ను మనం కూడా చూడాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు.
It was such a big surprise call from #MegaStarChiranjeevi garu ... he said he loved #KausalyaKrishnamurthy teaser .. am still awestruck d way chiru sir spoke to me .. thank u so much sir ... such a big honour to me @CCMediaEnt
— aishwarya rajessh (@aishu_dil) 18 June 2019
Comments
Please login to add a commentAdd a comment