సాహోలో మరో బాలీవుడ్ స్టార్ | Chunky Pandey in Prabhas Sahoo | Sakshi
Sakshi News home page

సాహోలో మరో బాలీవుడ్ స్టార్

Published Tue, Jul 25 2017 10:21 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

సాహోలో మరో బాలీవుడ్ స్టార్ - Sakshi

సాహోలో మరో బాలీవుడ్ స్టార్

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒకే షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలోనే ప్రభాస్ సాహో యూనిట్తో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తుండగా, తాజాగా మరో కీలక పాత్రకు బాలీవుడ్ నటుడ్ని ఎంపిక చేశారు.

తేజాబ్, ఆంఖే లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు చుంకీ పాండే సాహోలో నటించనున్నాడు. ఇటీవల విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేగంజాన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చుంకీ పాండే మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ జోడిగా అనుష్క నటిస్తుందని భావించినా.. అనుష్క సినిమాకు తగ్గట్టుగా రెడీ కాకపోవటంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement