ప్రేమించే మనిషి ఒక్కరు లేకుంటే...? | Comedian Ali's brother Khayyam as hero | Sakshi
Sakshi News home page

ప్రేమించే మనిషి ఒక్కరు లేకుంటే...?

Published Wed, Oct 16 2013 1:01 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ప్రేమించే మనిషి ఒక్కరు లేకుంటే...? - Sakshi

ప్రేమించే మనిషి ఒక్కరు లేకుంటే...?

 ప్రముఖ నటుడు అలీ సోదరుడు ఖయ్యూమ్ హీరోగా కీర్తన మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం దసరా రోజున హెదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎం.ఎన్.వి.సాగర్ దర్శకత్వంలో వాకా ప్రసన్నకుమార్ , సీహెచ్ నాగ మల్లేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నాని కెమెరా స్విచాన్ చేయగా, అలీ క్లాప్ ఇచ్చారు. 
 
 సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఖయ్యూమ్ మాట్లాడుతూ ‘‘హీరోగా నాకిది మూడో సినిమా. పూర్తి స్థాయిలో వినోదం ఉంటుంది’’ అని చెప్పారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. 
 
 నిర్మాతల్లో ఒకరైన నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ’’ వందమంది శత్రువులున్నా మనిషి బతకొచ్చు కానీ, ప్రేమించే మనిషి ఒక్కరు లేకుంటే బతకడం కష్టం. ఈ నేపథ్యంలో ఈ కథ తయారు చేశాను’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్-సమి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement