మాధురీ దీక్షిత్
ఎంతో ఆనందంగా ఉంది
Published Wed, Jan 1 2014 10:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ మరోసారి తెరపై కనిపించనుంది. త్వరలో విడుదల కానున్న దేడ్ ఇష్కియా’తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. దేడ్ ఇష్కియాలో మీ పాత్ర ఎటువంటిదని మీడియా ప్రశ్నించగా ‘బలమైన మహిళా పాత్రలకు ప్రోత్సాహం లభించడం ముదావహం. దేడ్ ఇష్కియా సినిమా కథ ఎంతో లోతైనది. అంతేకాకుండా వినోదాత్మకంగా ఉంటుంది. బాలీవుడ్‌లో కథానాయికలకు గొప్ప పాత్రలు లభించడం ఆనందం కలిగిస్తోంది.’ అని తెలిపింది.
మంచి పాత్రతో కూడినఅవకాశం రావడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది’ అని తెలిపింది. 1980-90 మధ్యకాలంలో తేజాబ్, రాంలఖన్, దిల్, బేటీ, సాజన్ వంటి సినిమాలతో మాధురీదీక్షిత్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది. ఇంకా ప్రహర్, మృత్యుదండ్ వంటి ఆఫ్ బీట్ సినిమాల్లోనూ మాధురి తన సత్తా చాటుకుంది. ఆ తర్వాత అనేక సంవత్సరాలపాటు బాలీవుడ్‌ను ఏలిన మాధురి 1999లో డాక్టర్ శ్రీరాంను వివాహమాడి అమెరికాకు మకాం మార్చింది. తిరిగి 2007లో ఆజా నచ్‌లే సినిమాలో నటించి బాక్స్ ఆఫీస్‌వద్ద రికార్డు సృష్టించింది. మళ్లీ అమెరికా వెళ్లిపోయింది. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ స్వదేశానికి వచ్చింది. అయితే సినిమా అవకాశాలు మాత్రం ఆమె ఇంటి తలుపు తట్టలేదు.
ఝలక్ దిఖ్‌లాజా అనే డ్యాన్స్ రియాలిటీ షో ఐదు, ఆరు సీజన్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఆ త ర్వాత మాధురికి రెండు సినిమా అవకాశాలొచ్చాయి. అవే దేడ్ ఇష్కియా, గులాబ్ గ్యాంగ్. ఇవి రెండు పూర్తిగా మహిళా కథాచిత్రాలే. ఈ రెండింటికి మధ్య విరామంలో యే జవానీ హై దివానీ సినిమాలో గాఘ్రా ధ రించి ఓ ప్రత్యేక పాటలో నటించింది. దేడ్ ఇష్కియా సినిమాలో నటించే అవకాశం లభించడం మాధురికి బాలీవుడ్‌లో గొప్ప అడుగు వంటిది. అభిషేక్ చౌబే దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఈ నెల పదో తేదీన విడుదల కానుంది.
Advertisement
Advertisement