స్టార్‌డమ్ పిల్లలకు ఇబ్బందిగా మారలేదు: మాధురీ
స్టార్‌డమ్ పిల్లలకు ఇబ్బందిగా మారలేదు: మాధురీ
Published Tue, Aug 6 2013 10:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
పెళ్లి పేరు ఎత్తితే సినీ తారలకు గుండె కొట్టుకోవడం ఆగిపోవడం ఖాయం. ఇక పెళ్లి తర్వాత పిల్లలు కూడా ఉంటే ఇక వారి చాప్టర్ క్లోజ్. వీటన్నింటికి భిన్నంగా ఒకప్పుడు అగ్రస్థానంలో కొనసాగిన మాధురీ దీక్షిత్ బాలీవుడ్‌లో మళ్లీ మెరుపులు మెరిపిస్తోంది.
అయితే నా స్టార్‌డమ్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు’ అని మాధురీ దీక్షిత్ తెలిపింది. అమెరికా స్థిరపడిన డాక్టర్ శ్రీరాం మాధవ్ నేనేతో వివాహం తర్వాత మాధురీ దీక్షిత్ కు ఆరిన్, రాయన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తున్న మాధురీని చూసి ఆమె పిల్లలు తెగ సంబరపడిపోతున్నారట. ‘మమ్మీ నీవు టీవీలో కనిపించావు. నిజంగా నీవు అంత గొప్పదానివా?’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్లో వాలుతారు అని మాధురీ వెల్లడించింది. బాలీవుడ్, టెలివిజన్ రంగంలో తనకున్న స్టార్‌డమ్ తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం తన అదృష్టమని, వాళ్లు అమాయకంగా ఉండటమే తనకు ఇష్టం అని తెలిపింది.
పెళ్లి తర్వాత ఓ దశాబ్దం పాటు అమెరికాలో గడిపిన మాధురీ దీక్షిత్ 2011లో భారత్‌కు మాధురీ తిరిగివచ్చింది. ప్రస్తుతం గులాబ్ గ్యాంగ్, దేద్ ఇష్కియా చిత్రాల తోపాటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమోతో కలిసి కలర్స్ టెలివిజన్ చానెల్లో ’ఝలక్ దిక్లా జా’ అనే డాన్స్ రియాల్టీ షోలో మాధురీ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇప్పుడిప్పుడే బిజీగా మారుతోంది.
Advertisement
Advertisement