2015లో అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా? | Dilwale Sonam Kapoor Prem Ratan Dhan Paayo Golden Kela Awards Sooraj Pancholi | Sakshi
Sakshi News home page

2015లో అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా?

Published Sun, Apr 3 2016 3:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

2015లో అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా?

2015లో అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా?

షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జోడీ ఐదేళ్ల తర్వాత వెండితెర మీద తళుక్కుమన్న సినిమా 'దిల్‌వాలే'. బాలీవుడ్‌లోనే సూపర్‌ హిట్‌ జోడీగా పేరొందిన ఈ జంట 'దిల్‌వాలే' చిత్రంలో ఆ మ్యాజిక్‌ చూపించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టినా.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది. తాజాగా 'దిల్‌వాలే' సినిమా 2015 సంవత్సరానికిగాను అత్యంత చెత్త సినిమాగా గోల్డెన్‌ కేలా పురస్కారాన్ని అందుకొంది. భారీ అంచనాలతో విడుదలైన 'ప్రేమ్‌ రతన్ ధన్‌పాయో' సినిమాకుగాను సోనం కపూర్‌ అత్యంత చెత్త నటి పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు 8వ వార్షిక గోల్డెన్ కేలా పురస్కారాలను ప్రకటించారు.   

గత ఏడాది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చి.. ప్లాఫ్ సినిమాలుగా నిలిచిన బొంబే వెల్వెట్‌, షాన్‌దార్‌, తెవర్‌, అక్షయ్‌కుమార్ 'సింగ్ ఈజ్ బ్లింగ్‌'తో పోటీపడి మరీ 'దిల్‌వాల్‌' చెత్త చిత్రం రేసులో విన్నర్‌గా నిలిచింది. 'ఏబీసీడీ-2'కుగాను శ్రద్ధా కపూర్‌, 'సింగ్ ఈజ్‌ బ్లింగ్‌'కుగాను అమీ జాక్సన్‌తో పోటీపడి సోనం కపూర్‌ చెత్తనటి పురస్కారాన్ని దక్కించుకుంది. ఆమె నటించిన 'ప్రేమ్‌ రతన్ ధన్‌పాయో'ను తెరకెక్కించిన దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా 'చెత్త దర్శకత్వం అవార్డు'కు ఎంపికయ్యాడు. దాంతోపాటు 'బస్‌ కిజియో బహుత్‌ హోగయా అవార్డు' (చాలా చేశారు, ఇకనైనా ఆపండి) కూడా ఆయననే వరించింది.

'హీరో' సినిమాతో బాలీవుడ్‌కు ఎంటరైన సూరజ్ పంచోలి చెత్త నటుడిగా ఎంపికయ్యాడు. అర్జున్ రాంపాల్‌ (రాయ్‌), అర్జున్ కపూర్ (తెవర్‌), ఇమ్రాన్‌ ఖాన్ (కట్టిబట్టీ)తో పోటీపడి ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసిన 'ప్రేమ్ రతన్ ధన్‌పాయో' టైటిల్ పాటకు 'మోస్ట్ ఇరిటేటింగ్‌ సాంగ్‌' (బాగా చికాకు పరిచే పాట) అవార్డు దక్కింది. 'దిల్లీవాలి జాలీమ్ గర్ల్‌ఫ్రెండ్‌'లోని 'బర్త్‌డే బాష్‌' పాటకు అరాచకమైన పాట పురస్కారం దక్కింది.

అలాగే కేలా బృందం ఈసారి కూడా కొన్ని ప్రత్యేక అవార్డులు ప్రకటించింది. అవి...

  • మనోజ్‌ కుమార్ అవార్డ్‌ ఫర్ హిస్టారిక్ అక్యూరెసి: సంజయ్‌ లీలా బన్సాలీ (బజీరావు మస్తానీ)
  • ధారాసింగ్‌ అవార్డు (చెత్తగా డైలాగులు పలికినందుకు): రణ్‌దీప్ హుడా (మై ఔర్‌ చార్లెస్‌)
  • సంఘ్ పరివార్ అవార్డు: దిల్‌వాలే లోని 'గెరువా' పాట
  • శక్తి కపూర్ 'స్త్రీ ద్వేషి' అవార్డు:  ప్యార్‌ కా పంచునామా 2
  • వాట్‌ ద హెల్ అవార్డు: సోనాక్షి సిన్హా (ఇష్కాహాలిక్‌)
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement