నటుడు రంజిత్, రాగసుధ విడిపోయారు
చెన్నై: నటుడు రంజిత్, రాగసుధ విడాకులు పొందారు. రంజిత్... నటి రాగసుధను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సింధునది మరుమలర్చి, నట్పుకాగ చిత్రాల్లో నటించిన రంజిత్ గతంలో నటి ప్రియారామన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పలు మలయాళ చిత్రాలు,కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించిన ప్రియారామన్,రంజిత్ 13 ఏళ్ల వివాహ జీవితం తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.
దీంతో రంజిత్ నటి రాగసుధను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని నెలలకే వీరిద్దరూ విడిపోయారు. దీని గురించి రంజిత్‌ను అడగ్గా తాము విడిపోయిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఇకపై నటనపై దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు రాగసుధ తల్లి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రంజిత్,రాగసుధ విడిపోయినట్లు వెల్లడించారు.