
‘‘నటిగా ఇలాంటి సినిమాలే చేయాలి. ఇవే పాత్రల్లో కనిపించాలి అని నాకు నేను పరిమితులు పెట్టుకోను. కమర్షియల్ సినిమా అయినా, కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అయినా దేని లాభాలు దానికి ఉంటాయి. ఏదైనా చేయాలనుకుంటాను’’ అంటున్నారు దిశా పటానీ. బాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా పాపులారిటీ పొందారు దిశా పటానీ.
పాత్రల ఎంపిక విషయంలో తన ఆలోచనా విధానం గురించి దిశా పంచుకుంటూ – ‘‘అన్ని రకాల పాత్రలు చేయగలిగినప్పుడే మంచి నటి అవుతాం. ఒక తరహా పాత్రలే చేద్దామనుకుంటే మనకి మనం ఓ లిమిట్ పెట్టేసుకుంటున్నట్లే. నేను లిమిట్ దాటాలనుకుంటున్నాను. ఒక జానర్‌కి, ఒక స్టయిల్‌ల్లోనే మిగిలిపోకూడదనుకుంటున్నాను’’ అన్నారామె. ప్రస్తుతం ‘కేటీనా’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం, సల్మాన్‌ఖాన్ సరసన ‘రాథే’ సినిమాలో నటిస్తున్నారు దిశా.
Comments
Please login to add a commentAdd a comment