
‘‘పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాను’’ అంటున్నారు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ. ‘లోఫర్, ధోని బయోపిక్, భాగీ 2, మలంగ్’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు దిశా. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్టర్‌గా మీకు ఎలాంటి సినిమాలు చేయాలనుంది? అని దిశాని అడిగితే – ‘‘అన్ని రకాల పాత్రలను చేయాలనుకుంటున్నాను. నేను చేసే ప్రతీ పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండాలనుకుంటాను. ప్రస్తుతానికి ఓ యాక్షన్ సినిమా చేయాలనుంది. ఆ సినిమాలో ఫుల్ యాక్షన్ చేసి, యాక్షన్ సినిమాలకు కూడా పనికొస్తానని నిరూపించుకోవాలని ఉంది’’ అన్నారు దిశా.
Comments
Please login to add a commentAdd a comment