
జోయా ఫాక్టర్ ఫస్ట్ లుక్
సాక్షి, సినిమా : సౌత్ క్రేజీ స్టార్ దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘జోయా ఫ్యాక్టర్’ పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంజు చౌహాన్ నవల ది జోయా ఫ్యాక్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయబోతున్నారు.
ఈ చిత్రంలో దుల్కర్ సరసన బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ సోనమ్ కపూర్ నటిస్తోంది. ‘ఇది నాకు చాలా ప్రత్యేకం’ అంటూ తన ట్విట్టర్‌లో చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఓ సున్నితమైన ప్రేమకథగా ఇది తెరకెక్కబోతోంది. అడ్లాబ్స్ ఫిలింస్-ఫాక్స్ స్టార్ స్టూడియోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. 2019 ఏప్రిల్ 5న జోయా ఫ్యాక్టర్ విడుదల కానుంది.
అయితే జోయా ఫ్యాక్టర్ దుల్కర్ బాలీవుడ్ డెబ్యూ కాదు. రోన్ని స్క్రూవాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కర్వాన్ షూటింగ్‌లో ఈ క్రేజీ స్టార్ ఎప్పటి నుంచో పాల్గొంటున్నాడు. మళయాళ సీనియర్ హీరో మమ్మూటీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వరుస సక్సెస్‌లు, క్రేజ్‌తో తనకంటూ సల్మాన్ సౌత్‌లో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు తెలుగులో సావిత్రి బయోపిక్ మహానటిలోనూ దుల్కర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
Now this one is really special for me! Introducing #ZoyaFactor a movie based on Anuja Chauhan’s bestseller. Releasing on April 5, 2019! Co-starring @sonamakapoor, directed by #AbhishekSharma. #AdlabsFilms @foxstarhindi pic.twitter.com/1dxzuYYysS
— dulquer salmaan (@dulQuer) 13 March 2018