సాక్షి, హైదరాబాద్ : ఈ రోజు ఉదయం మృతి చెందిన నిర్మాత రాఘవ భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి, రాఘవతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నా బతుకు ప్లాట్ ఫాం మీద పడ్డప్పుడు నన్ను ఆదుకొని అన్నం పెట్టింది రాఘవ గారే. తల్లిదండ్రులు అండ లేకుండానే సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. మూకీ సినిమా నుంచి డిజిటల్ యుగం వరకు సినీ రంగంలోని అన్ని మార్పులు చూసిన మహానుభావుడు.
చిత్ర పరిశ్రమ రాఘవగారిని సముచితంగా గౌరవించి అంత్యక్రియలు జరపాల’ని కోరారు. ‘మహా మనిషి కే రాఘవ గారు సామాజిక మార్పు కోసం ఎన్నో చిత్రాలు అందించారు. ఆయన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. వందేళ్ల వయస్సులోనూ కేబీఆర్ పార్క్‌లో మాతో పాటు వాకింగ్ చేసేవారు’ అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నిర్మాత ఆదిశేషగిరి రావు, నటుడు సుమన్, వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతిలు ఉన్నారు.
మరిన్ని కథనాలు..
ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత
నన్ను కొడుకులా చూసుకున్నారు : సుమన్
Comments
Please login to add a commentAdd a comment