నన్ను కొడుకులా చూసుకున్నారు : సుమన్‌ | Film Stars Pay Condolences To Producer Raghava | Sakshi
Sakshi News home page

Jul 31 2018 10:23 AM | Updated on Aug 28 2018 4:32 PM

Film Stars Pay Condolences To Producer Raghava - Sakshi

తెలుగు సినీ రంగంలో భీష్ముడిగా పేరు తెచ్చుకున్న లెజెండరీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఈ రోజు ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు సినీ రంగంలో భీష్ముడిగా పేరు తెచ్చుకున్న లెజెండరీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఈ రోజు ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని రాఘవ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి లక్ష్మీపార్వతి, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ, సుమన్‌లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా నటుడు సుమన్‌ మాట్లాడుతూ.. ‘రాఘవగారి నిర్మాణంలో తెరకెక్కిన తరంగిణి సినిమా వెయ్యి రోజుల పాటు ఆడింది. ఆయన నన్ను కొడుకులా చూసుకున్నారు. రాఘవగారు, భరద్వాజగారి లాంటి వారి సహకారం వల్లే నా జీవితం మలుపు తిరిగింది. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంలో రాఘవగారు కృషి ఎంతో ఉంది. ఆయనలేని లోటు పూడ్చలేనిది’ అన్నారు.

అందరు అభిమానించే రాఘవగారు జీవితం ఆదర్శవంతమని, ఆయన అలవాట్లే 105 సంవత్సరాలు బతికించాయని లక్ష్మీపార్వతి అన్నారు. వాకింగ్‌లో రాఘవగారు కలుస్తుండేవారని, ఆయన అనుభవాలను తమతో పంచుకునేవారని తెలిపారు.

ప్రముఖ సినీ నిర్మాత కే రాఘవ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement