చిరుతో టాప్‌ షూటర్‌ మీటింగ్‌! | Gagan Narang Meeting With Chiranjeevi | Sakshi
Sakshi News home page

Nov 1 2018 6:39 PM | Updated on Nov 1 2018 6:45 PM

Gagan Narang Meeting With Chiranjeevi - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవిని ప్రముఖ షూటర్‌ గగన్‌ నారంగ్‌ కలిసినట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. అయితే వీరి మీటింగ్‌కు సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశారు గగన్‌ నారంగ్‌. చిరుతో చిత్ర విశేషాలు, షూటింగ్‌కు సంబంధించిన విషయాలను మాట్లాడినట్టు తెలిపారు. 

చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడిగా నటిస్తున్నందున... గగన్‌ నారంగ్‌  వద్ద షూటింగ్‌కు సంబంధించిన మెలుకువల గురించి చిరు చర్చించారు. ఇటీవలె జార్జియా షెడ్యుల్‌ను కంప్లీట్‌ చేసుకుంది చిత్రయూనిట్‌. తదుపరి షెడ్యుల్‌లో యాక్షన్‌ సన్నివేశాల్లో షూటింగ్‌కు సంబంధించిన మెలుకువలు తెలుసుకునేందుకు గగన్‌ నారంగ్‌ను కలిశారు. విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, సుధీప్‌ కీలక పాత్రలు నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement