ఆర్యతో మరోసారి | Hansika Motwani-Arya Teaming Up Again | Sakshi
Sakshi News home page

ఆర్యతో మరోసారి

Published Fri, Jan 31 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

ఆర్యతో మరోసారి

ఆర్యతో మరోసారి

యువ నటుడు ఆర్యలో ఏదో ఆకర్షణ శక్తి ఉందనిపిస్తోంది. ఆయనకు హీరోయిన్లు ఇట్టే ఆకర్షితులవుతారు అన్నది కోలీవుడ్ టాక్. దాన్ని నిజం చేసేలా క్రేజీ హీరోయిన్ హన్సిక ఆర్యతో మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నారు. సాధారణంగా ఒక చిత్రం ఫ్లాప్ అయితే అదే జంటతో వెంటనే మరో చిత్రం చేయడానికి దర్శక నిర్మాతలు సాహసించరు. ఆర్య, హన్సిక ఇంతకు ముందు నటించిన సేట్టై చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా ఈ జంట మరోసారి కలసి నటించడానికి సిద్ధమవుతున్నారు. మిగమాన్ చిత్రంలో ఇంకోసారి ఈ జంట తెరపైకి రానుంది. మణిళతిరుమని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పై కెళ్లనుంది. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మిగమాన్ చిత్ర కథనం తమిళ తెరకు కొత్తగా ఉంటుందన్నారు. హన్సికకు కథ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయిన వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. సేట్టై చిత్రంలో ఆర్య, హన్సిక మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని ఈ చిత్రంతో ఈ జంట హిట్ పెయిర్‌గా నిలుస్తుందని దర్శకుడు అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement