వివాదంలో హన్సిక! | Hansika Motwani In Controversy Again | Sakshi
Sakshi News home page

వివాదంలో హన్సిక!

Published Fri, Mar 28 2014 12:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వివాదంలో హన్సిక! - Sakshi

వివాదంలో హన్సిక!

తొలినాళ్లలో హన్సిక వివాదరహితురాలే. శింబుతో ప్రేమ.. తర్వాత కటీఫ్.. ఈ నేపథ్యంలోనే.. హన్సిక కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకెళితే... చెన్నయ్‌కి చెందిన ఓ క్యాబ్ కంపెనీ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లడానికి అంగీకారం తెలిపారు హన్సిక. హైదరాబాద్ నుంచి హన్సిక అండ్ టీమ్ చెన్నయ్ వెళ్లడానికి సదరు క్యాబ్ కంపెనీ వారు కొన్ని ఫ్లయిట్ టికెట్స్ కూడా బుక్ చేశారు.
 
  అయితే... చివరి నిమిషంలో మరో అయిదు టికెట్స్‌ని బుక్ చేయమని క్యాబ్ కంపెనీ వారిని హన్సిక రిక్వెస్ట్ చేశారట. ఆర్థిక భారం అధికమవుతుండటంతో ‘ఇక ఫ్లయిట్ టికెట్స్ తీయలేం’ అని క్యాబ్ కంపెనీవారు కరాఖండీగా చెప్పేశారట. మరి... ఈ పరిణామం హన్సికకు బాధ కలిగించిందో ఏమో.. అసలు ఓపెనింగ్‌కే ఎగనామం పెట్టేసింది. తమ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హన్సిక రాబోతున్నారని ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేసుకున్న ఆ సంస్థ... హన్సిక హ్యాండివ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. పైగా ఆహ్వాన పత్రికల్లో కూడా హన్సిక పేరు వేయడంతో వారు అవమానంగా కూడా ఫీలయ్యారట.
 
  ‘బాధ్యత కలిగిన సెలబ్రిటీ చేయాల్సిన పని కాదిది’ అంటూ హన్సికపై విమర్శల బాణాలను సంధించింది సదరు కంపెనీ యాజమాన్యం. అయితే... ఈ విషయంపై హన్సిక వెర్షన్ వేరేలా ఉంది. ప్రారంభోత్సవానికి హాజరవుతాననడం నిజమేనని, అయితే... తన స్టిల్స్‌ని మాత్రం సదరు కంపెనీ వారు ప్రచారానికి ఉపయోగించుకోకూడదని ముందే షరతు విధించారని సమాచారం. కానీ, దాని తాలూకు ఒప్పంద పత్రాన్ని అందజేయలేదట. అది తనకు బాధ కలిగించడంతో ఈ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడానికి ఇష్టపడలేదట. చివరి నిమిషంలో కాకుండా, ఈ విషయాన్ని ముందే తెలియ జేశారట హన్సిక. మరి.. వీరి వాదనల్లో ఏది నిజమో వాళ్లకే తెలియాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement