హ్యాట్రిక్‌కి క్లాప్!
మంచు విష్ణు, హన్సిక జంటగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ‘లక్కున్నోడు’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మోహన్‌బాబు క్లాప్ ఇచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడికి స్క్రిప్ట్ అందించి, చిత్రబృందాన్ని అభినందించారాయన. నిర్మాత మాట్లాడుతూ - ‘‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’ వంటి విజయాల తర్వాత విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది.
కచ్చితంగా హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హారర్ సినిమాలతో హిట్ దర్శకుడు అనిపించుకున్న రాజ్‌కిరణ్ కూడా ఈ ‘లక్కున్నోడు’తో హ్యాట్రిక్‌పై కన్నేశారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్. వచ్చే జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పీజీ విందా, మ్యూజిక్: అచ్చు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్.