లవ్‌లో లక్కున్నోడు | Lakkunnodu movie second scheduld will start on monday | Sakshi
Sakshi News home page

లవ్‌లో లక్కున్నోడు

Published Fri, Oct 14 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

లవ్‌లో లక్కున్నోడు

లవ్‌లో లక్కున్నోడు

అమ్మాయితో ప్రేమలో పడితే చాలదు. ఆ ప్రేమను దక్కించుకోవాలంటే ఒక్కోసారి అదృష్టమూ కలసి రావాలనే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘లక్కున్నోడు’. మంచు విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ సోమవారం ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. విష్ణు కామెడీ సినిమాకే హైలైట్ అవుతుంది. సోమవారం నుంచి నవంబర్ వరకూ జరిగే షెడ్యూల్‌లో షూటింగ్ అంతా పూర్తి చేస్తాం’’ అన్నారు.

రాజ్ కిరణ్ మాట్లాడుతూ - ‘‘వింత వింత మనస్తత్వాలున్న ఓ కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తాడు ఓ అబ్బాయి. వింత మనుషులతో వేగుతూ ఆ అబ్బాయి తన ప్రేమకథను ఎలా గెలిపించుకున్నాడు? అదృష్టం అతనికి ఎలా కలిసొచ్చింది? అనేది ఆసక్తికరం’’ అన్నారు. తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శీను, ‘సత్యం’ రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పీజీ విందా, సంగీతం: అచ్చు, ప్రవీణ్ లక్కరాజు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement