లక్కు... లెక్కున్నోడు! | Lakkunnodu Movie First Look poster | Sakshi
Sakshi News home page

లక్కు... లెక్కున్నోడు!

Published Sun, Nov 6 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

లక్కు... లెక్కున్నోడు!

లక్కు... లెక్కున్నోడు!

 ప్రతిభతో పాటు అదృష్టం తోడైతే.. ఏ రంగంలోనైనా విజయం తథ్యమనేది పెద్దల మాట. ఆ కుర్రాడి అదృష్టానికి లోటు లేదు. లక్ మాత్రమే కాదు, లెక్క కూడా బోలెడంత ఉందట. దాంతో ఈ లెక్కునోణ్ణి ‘లక్కున్నోడు’ అంటుంటారంతా. మరి, లవ్ సంగతేంటి? అనడిగితే... మా ‘లక్కున్నోడు’ విడుదల వరకూ ఎదురు చూడమంటున్నారు దర్శకుడు రాజ్ కిరణ్. మంచు విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుతో చిత్రీకరణ పూర్తవుతుంది.
 
 నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్, కామెడీలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. విష్ణు పాత్ర, లుక్ కొత్తగా ఉంటాయి. ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాల తర్వాత విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్, ‘ప్రభాస్’ శీను, ‘సత్యం’ రాజేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పి.జి. విందా, సంగీతం: అచ్చు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement