ఫిబ్రవరిలో... లక్
‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ తర్వాత మంచు విష్ణు, బబ్లీ బ్యూటీ హన్సిక జంటగా తెరకెక్కిన తాజా చిత్రం– ‘లక్కున్నోడు’. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టిన రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తవడంతో చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
ఈ సినిమాతో విష్ణు, హన్సికల కాంబినేషన్ మూడో హిట్ సాధించనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తయింది. పోసాని, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీనుల వినోదం ప్రేక్షకులను కడుపు»్బ నవ్విస్తుంది. జనవరిలో పాటలు, ఫిబ్రవరి 3న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: అచ్చు ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్.