వెరైటీ ఫ్యామిలీతో..!
రెండేళ్ల తర్వాత హన్సిక నటిసున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ‘లక్కున్నోడు’. హీరో మంచు విష్ణుతో ఆమెకిది మూడో సినిమా. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో కథంతా హన్సిక పాత్ర చుట్టూనే తిరుగుతుందట. పద్మ అనే అమ్మాయి పాత్రలో హన్సిక నటిస్తున్నారు.
పద్మతో ప్రేమలో పడిన యువకుడు ఆమె కుటుంబంతో ఎలాంటి పాట్లు పడ్డాడు? ఆయా సందర్భాలకు తగ్గట్టు ‘డైమండ్’ రత్నబాబు రాసిన ఫన్నీ డైలాగులు ప్రేక్షకులను నవ్విస్తాయని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘రేసు గుర్రం’లో హీరోయిన్ ఫ్యామిలీ టైపులో, ఈ సినిమాలో హీరోయిన్‌ది ఓ వెరైటీ ఫ్యామిలీ అట. ఆ కుటుంబ సభ్యుల క్యారెక్టరైజేషన్‌లు ఒక్కొక్కటీ ఒక్కో టైప్‌లో డిఫరెంట్‌గా ఉంటాయట!