మనసున్నోడు!
ప్రేమించిన అమ్మాయి అతడి పక్కనే ఉంది. మనీకి లోటుందా? అనడిగితే, లేదనే చెప్పాలి. అన్నిటికీ మించి ఆ కుర్రాడు మంచి మనసున్నోడు, అదృష్టవంతుడు. మరి, ఇంకేంటి అతడి సమస్య? అంటే... ‘లక్కున్నోడు’ విడుదల వరకూ వెయిట్ చేయమంటున్నారు దర్శకుడు రాజ్‌కిరణ్. మంచు విష్ణు, హన్సిక జంటగా ఆయన దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ‘లక్కున్నోడు’.
నేడు విష్ణు బర్త్‌డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ‘‘విష్ణు శైలిలో సాగే లవ్ ఎంటర్‌టైనర్ ఇది. త్వరలో పాటల్ని, డిసెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: ‘డైమండ్’ రత్నబాబు, కెమేరా: పీజీ విందా, సంగీతం: అచ్చు, ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.