అప్పుడు బ్యాడ్‌ బిజినెస్‌ మ్యాన్‌ కింద లెక్క! | Luckunnodu is releasing on January 26th | Sakshi
Sakshi News home page

అప్పుడు బ్యాడ్‌ బిజినెస్‌ మ్యాన్‌ కింద లెక్క!

Published Tue, Jan 24 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

అప్పుడు బ్యాడ్‌ బిజినెస్‌ మ్యాన్‌ కింద లెక్క!

అప్పుడు బ్యాడ్‌ బిజినెస్‌ మ్యాన్‌ కింద లెక్క!

‘‘హీరోలు కాదు, దర్శకులే నిజమైన ఫిల్మ్‌ మేకర్స్‌. రియల్‌ స్టార్‌ పవర్‌ ఉండేది దర్శకుల చేతిలోనే! ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రాలు చూడండి. ‘ఖైదీ నంబర్‌ 150’ వంటి చిత్రాలు చిరంజీవి అంకుల్‌ చాలా చేసినా... వీవీ వినాయక్‌గారు మళ్లీ బ్రహ్మాండంగా తీశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చరిత్రని క్రిష్‌ అద్భుతంగా ఆవిష్కరించారు. రెండూ హిట్టయ్యాయి కదా! నిజంగా, ప్రేక్షకులను మార్చగలిగేది దర్శక, రచయితలే’’ అన్నారు మంచు విష్ణు. ఆయన హీరోగా రాజకిరణ్‌ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘లక్కున్నోడు’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా విష్ణు చెప్పిన విశేషాలు....

శాంతియుత పోరాటం వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది. మరోసారి ‘జల్లికట్టు’ ఆ అంశాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎవరైనా శాంతియుతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే తప్పకుండా గుర్తించాలి. నాకు మంట తెప్పించే అంశం ఏంటంటే... ఉత్తరాది, దక్షిణాదిల మధ్య ఓ విభజన రేఖ గీయడం. మనం (దక్షిణాది ప్రజలు) నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడతాయి.  కానీ, వాళ్లు మనకి సరైన విలువ, గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదు. విలువ ఇవ్వనప్పుడు వేర్వేరు దేశాలు చేస్తే బాగుంటుంది కదా.

  ‘ఎస్‌3’ వాయిదాతో లక్కీగా మీకు మంచి విడుదల తేదీ దొరికింది!
సినిమా ప్రారంభించినప్పుడు జనవరి 26న విడుదల చేయాలనేది మా ప్లాన్‌. లాంగ్‌ వీకెండ్, సెలవులు, మంచి విడుదల తేదీ అనేది మా ఫీలింగ్‌. ఫస్ట్‌ కాపీ ఎప్పుడో రెడీ అయింది. కానీ, డిసెంబర్‌లో రావాల్సిన చిత్రాలు వాయి దా పడడంతో వచ్చే నెల 3న విడుదల చేద్దామనుకున్నాం. 26న ఖాళీ కావడంతో వచ్చేస్తున్నాం.

ఈ సినిమాలో మీ పేరు లక్కీ. పేరులో ఉన్న లక్‌ ఆ కుర్రాడి జీవితంలో ఉందా?
‘నేను లక్కీనా? అన్‌లక్కీనా?’ అనే ప్రశ్న అతడిలోనూ ఉంటుంది. ఎందుకంటే... తన ప్రమేయం లేకుండానే లక్కీ జీవితంలో ఏవేవో జరుగుతాయి. అందరూ అతణ్ణి అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకున్న తండ్రి చేత ఒక్క ప్రశంస అయినా పొందాలని లక్కీ కోరిక. తండ్రి సెంటిమెంట్‌తో కూడిన మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌.

థ్రిల్లర్స్‌ తీసిన దర్శకుడు రాజకిరణ్, ఈ కామెడీ టచ్‌ ఉన్న సిన్మాని ఎలా హ్యాండిల్‌ చేశారు?
ఆయనలో విపరీతమైన కామెడీ టైమింగ్‌ ఉంది. ‘గీతాం జలి’ని కొంచెం కామెడీగానే తీశారు కదా. మంచి కథకి తోడు ప్రతి సీన్‌లోనూ నవ్వించే డైలాగులు పడ్డాయి. ఈ సినిమాకి మెయిన్‌ హీరో డైలాగ్సే. ‘డైమండ్‌’ రత్నబాబు కథ చెబుతున్నంత సేపూ నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులూ అంతే ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో నా సై్టల్‌ ఆఫ్‌ యాక్షన్, కామెడీ, మంచి పాటలు.. అన్నీ ఉన్నాయి.

మీ లక్కీ పెయిర్‌ హన్సికని రిపీట్‌ చేయాలనే ఐడియా ఎవరిది?
ఇందులో హీరో హీరోయిన్ల మధ్య మంచి కామెడీ టైమింగ్, సాన్నిహిత్యం ఉండాలి. దర్శకుడు కథ చెప్పినప్పుడు ‘మీరు, హన్సిక అయితే బాగుంటుంది.  సినిమాలు చేశారు కదా. మళ్లీ జంటగా నటిస్తారా?’ అనడిగారు. ఆయన ముందే హన్సికకి ఫోన్‌ చేసి అడగ్గానే కథ వినకుండానే ఓకే చెప్పేసింది.

బయట నిర్మాణ సంస్థల్లో నటిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది?
బ్యానర్‌ ఎవరిదైనా డబ్బు డబ్బే. సొంత సినిమాకి ఎంత ఖర్చుపెట్టినా నా ప్రమోషన్‌ కాస్ట్‌ అనుకోవచ్చు. బయట నిర్మాతలతో అయితే జాగ్రత్తగా, లాభాలు రావాలని ఆలోచిస్తా.

హీరోగా, నిర్మాతగా మీరు లెక్కలు వేసుకుంటారా?
వంద శాతం. లేదంటే బ్యాడ్‌ బిజినెస్‌మ్యాన్‌ కింద లెక్క. ఉదాహరణకు.. నా లాస్ట్‌ సినిమా 20 కోట్లు వసూలు చేస్తే, కొత్త సినిమాకి అంత బడ్జెట్‌ కాకుండా 15 కోట్లలో సినిమా లాభం వచ్చేలా చూసుకోవాలి. 20 కోట్లు వచ్చాయని 30 కోట్లు పెట్టి సినిమా తీయాలనుకోను. కథ విన్నప్పుడే బడ్జెట్‌ ఎంతనే అవగా హన వచ్చేస్తుంది. కొన్ని సినిమాలకు మాత్రం ఈ లెక్కలు వేయకూడదు. ‘భక్త కన్నప్ప’కి మేం అనుకున్న బడ్జెట్‌ 45 కోట్లు. ఇప్పుడు నా మార్కెట్‌ వేల్యూ అంత లేదు. కానీ, ఆ కథపై నాకంత నమ్మకం.

►‘భక్త కన్నప్ప’,  ‘రావణ్‌’ సినిమాలు ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు?
ప్రస్తుతం ‘భక్త కన్నప్ప’ స్టోరీబోర్డ్‌ స్టేజిలో ఉంది. తనికెళ్ల భరణిగారు కథ మాత్రమే ఇస్తున్నారు. ఇక, నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘రావణ్‌’ ఎప్పుడనేది రాముడే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement