పంపిణీదారుడిగా నాగార్జున
హీరోగా సూపర్ సక్సెస్... నిర్మాతగానూ సూపర్ సక్సెస్... స్టూడియో, ఫిలిం స్కూల్ అధినేతగానూ సూపర్ సక్సెస్. నాగార్జున ఏం చేసినా అంతే. ఇప్పుడాయన ఖాతాలో మరో శాఖ చేరబోతోంది.
పంపిణీరంగంలోనూ నాగ్ అడుగుపెట్ట బోతున్నారు. వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఓ పంపిణీసంస్థను ఆయన ప్రారంభించారు. తను హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భాయ్’ చిత్రంతో ఈ పంపిణీసంస్థ శ్రీకారం చుట్టుకోనుంది.
ఈ చిత్రాన్ని వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేయనుంది. త్వరలో ఇతర ఏరియాల్లో కూడా పంపిణీ శాఖలను ప్రారంభించాలనుకుంటున్నామని నాగార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు.