
పశ్చిమగోదావరి, భీమవరం: సినీ నటుడు సుధీర్‌బాబు నటించిన ‘నన్నుదోచుకుందువటే’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం ఆదివారం భీమవరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక త్యాగరాజ భవనంలో పట్టణంలోని కృష్ణ, మహేష్ సుధీర్‌బాబు అభిమాన సంఘం చిత్రయూనిట్‌కు స్వాగతం పలికింది. కృష్ణ, మహేష్ ఫ్యాన్ అధ్యక్షుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభిమానులు సుధీర్‌బాబుకు జ్ఞాపిక బహూకరించారు.